బెండకాయలు అధికంగా తినండి.. గుండె జబ్బులు రాకుండా కాపాడుకోండి
26 October 2023
గుండె ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవాలంటే బెండకాయను ఆహారంగా విరివిగా వినయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బెండకాయ అద్భుతంగా పని చేస్తున్నట్టు జంతువులపై పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
జంతువుల్లో మాదిరిగా మనుషుల్లోనూ కొలెస్ట్రాల్‌ను బెండకాయ తగ్గించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య పరిశోధకులు.
మనుషుల్లో కూడా బెండకాయ తినేవారిపై చేసిన ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు అధ్యయనకారులు గుర్తించారు.
బెండకాయలో సమృద్ధిగా ఉండే ఫాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గటానికి ఎంతో ఉపయోగపడతాయి.
రక్తంలో గ్లూకోజు మోతాదులు కావాల్సిన మేరకు ఉండటానికీ బెండకాయ ఆహారంగా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చేయడంలో బెండకాయ ఉపకారిగా ఉంటుంది. అందుకే తరుచూ బెండకాయ తినడం ఆరోగ్యకరం.
బెండకాయలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పరోక్షంగా గుండె జబ్బులను రానీయకుండా రక్షణ కవచంగా పని చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి