చలికాలంలో జామపండు తినడం వల్ల ప్రయోజనాలు..
TV9 Telugu
08 February 2024
జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
విపరీతమైన జలుబుతో బాధపడేవారు జామ పండ్లను బాగా తినాలి. ఈ పండును రోగనిరోధక శక్తికి దివ్యౌషధంగా సూచిస్తున్నారు.
చలికాలం, ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా.. సీజన్ ఏదైనా సరే.. చౌకగా దొరికేదే పండు జామ పండు మాత్రమే.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే జామ పండును పేదవాడి యాపిల్ గా కూడా పిలుస్తారు.దీనిలో విటమిన్లు B2, E మరియు K పుష్కలంగా లభిస్తాయి.
కాల్షియం, ఫోలేట్, ఫైబర్, కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి జామ పండు రక్షిస్తుంది.
విశేషమేమిటంటే డయాబెటిక్ పేషెంట్లు కూడా జామపండు హ్యాపీగా తినవచ్చు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
హృద్రోగులు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటివి ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి సందేహం లేకుండా జామపండుని తినొచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. కొవ్వుని కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి