పచ్చిశెనగలు రోజు తిన్నారంటే.. సందడే సందడి..

TV9 Telugu

11 February  2024

బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పచ్చి శనగలు తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

పచ్చి శనగల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో తక్కువగా తింటారు.

జీర్ణ సమస్య, బలబద్దకాన్ని నివారించే పోషకాలు పచ్చి శనగల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

శరీరం దృఢత్వాన్ని పెంచే విటమిన్‌ బి9 పోషకం పచ్చి శనగల్లో పుష్కలంగా ఉంటుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.

ప్రతిరోజూ పచ్చి శనగలు తినడం వల్ల శరీరంలో డిప్రెషన్‌, మానసిక ఒత్తిడి దూరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు.

పచ్చి శనగల్లో దొరికే మెగ్నీషియం, పొటాషియం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు నిపుణులు, వైద్యులు.

వీటిని తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ కట్టడికి పచ్చి శనగలు అద్భుతంగా పని చేస్తాయని అన్నారు.

పచ్చి శనగలు జుట్టు ఆరోగ్యానికి మంచిది. జుట్టు రాలిపోకుండా జుట్టు కుదుల్లు పటిష్టంగా ఉంటాయి. పొట్టు తీసుకుని నానబెట్టి తింటే మరింత మంచిది.