రోజూ అల్లం తింటే ఆ సమస్యలకు చెక్..

TV9 Telugu

05 August 2024

సాంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్యంలో వివిధ రూపాల్లో అల్లంను వినియోగిస్తారు. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. వికారం తగ్గిస్తుంది.

ఫ్లూ, జలుబులతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లంలో జింజెరాల్ ప్రధాన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. అల్లంలోని చాలా ఔషధ గుణాలకు ఇది కారణం.

అల్లం తినడం వల్ల వికారం ను తగ్గిస్తుంది. కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వ్యక్తులలో వికారం, వాంతులు సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో అల్లం సహాయపడుతుంది. కీమోథెరపీ వల్ల కలిగే వికారం నివారణకు అల్లం సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో వచ్చే వికారంను కూడా తగ్గిస్తుంది. అయితే, ప్రసవానికి దగ్గరగా ఉన్న మహిళలు అల్లం తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. కీళ్ల నొప్పులు వస్తాయి. అల్లం ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బు ప్రమాద కారకాలను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక అజీర్తి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక స్థాయి LDL (చెడు) కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.