చలికాలంలో నెయ్యి తింటే ఇన్ని ఉపయోగాలా?

09 November 2023

ప్రతిరోజూ ఆహారంలో నెయ్యి తీసుకుంటే బరువు పెరగతారనేది వట్టి అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు.

చలికాలంలో నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో నెయ్యి తీసుకోవడం ద్వారా తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీలు వంటివి ఎదుర్కోవచ్చు.

శీతాకాలంలో తరుచూ నెయ్యి తినడం వల్ల అంతర్గత ఉష్ణం క్రమబద్దీకరింపబడి శరీరం లోపలి నుంచి వెచ్చగా మారుతుంది.

రెగ్యులర్ గా ప‌సుపు, మిరియాల‌తో క‌లిపి నెయ్యిని తీసుకుంటే ఒత్తిడి, నిద్ర‌లేమి సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది.

రోజూ నెయ్యి తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు.  విటమిన్‌ ఏ అధికంగా ఉన్నందున కంటి సమస్యలు తగ్గుతాయి.

నెయ్యి తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ను మాత్రమే పెరిగే అవకాశం ఉండటంతో గుండె జబ్బుల సమస్యలు దూరం అవుతాయి.