కోడిగుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

14 October 2023

సమతుల ఆహారంలో గుడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. యేటా అక్టోబర్‌ రెండో శుక్రవారాన్ని ‘వరల్డ్‌ ఎగ్‌ డే’గా జరుపుకుంటారు.

కోడిగుడ్డుతో రకరకాల వంటలను చిటికెటలో చేసుకునే వీలుండడంతో చాలా మందికి ఎగ్ తమ డైలీ ఫుడ్ డైట్‌లో భాగమైంది.

జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి ప్రతి ఒక్కరు సగటున 181 గుడ్లు తినాలి. ఈ విషయంలో జాతీయ సగటు 95గా ఉంది.

ఒక గుడ్డు 70-80 క్యాలరీల శక్తి, ఆరు గ్రాముల ప్రొటీన్లు, ఐదు గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ అందిస్తుంది.

విటమిన్‌-డీ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తింటే దాని నుంచి బయటపడొచ్చు. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

గుడ్డు పచ్చసొన పిల్లలు, గర్భిణులకు ఆరోగ్యకరం. అందులో కొంత కొవ్వు ఉన్నప్పటికీ అది గుండెకు మేలు చేస్తుంది.

ప్రతిరోజు ఒక కోడి గుడ్డు మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఆస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉండేందుకు సాయపడుతుంది.

ఆరు నెలల శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒకరూ గుడ్డు తినొచ్చు. ఇది జీర్ణం కావడానికి కొంత ఎకువ సమయం పడుతుంది.