ఒక్క మొక్కజొన్న పొత్తులో దాదాపు 900 నుంచి వెయ్యి మైక్రోగ్రాముల యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటి వల్ల కంటిచూపు మెరుగవుతుందని నిపుణుల అధ్యయనంలో తేలింది.
వివిధ రకాల క్యాన్సర్లు, హృద్రోగం వంటి జబ్బులకు కారణమయ్యే కణాల బారి నుంచీ యాంటీఆక్సిడెంట్లు రక్షిస్తాయి. మొక్కజొన్న రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వర్షాకాలంలో తరచుగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి మొక్కజొన్న పొత్తులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాపాడుతుంటాయి.
మొక్కజొన్న గింజల్లో విటమిన్ గుండెకు రక్షణ కవచంలా పని చేస్తుంది.తక్కువ మోతాదులో మొక్కజొన్న నూనె వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇవి సహజంగానే తీపిగా ఉంటాయి. ఒక్క మొక్కజొన్న పొత్తులో ఉండే చక్కెర మోతాదు ఒక యాపిల్ పండు మూడో వంతు కన్నా తక్కువే. షుగర్ పేషెంట్స్ కూడా ఇష్టంగా తినొచ్చు.