కాకరకయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
16 November 2023
చాలా మంది ఇష్టపడని కాకర కాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాకర కాయ చేదుగా ఉండటంతో చాలా మంది ఇష్టపడరు.
అయితే కాకర చేసే మేలు తెలిస్తే మాత్రం రోజువారి మెనూలో తప్పకుండా చేర్చుకుంటారు. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది.
కాకర కాయ తీనడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. గాయాల నుంచి తొందరగా కోలుకోవచ్చు. విటమిన్-ఎ ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం, కంటి చూపు బాగుంటుంది.
ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల కాకరకయ తినడం వల్ల మనకు రోజువారీ అవసరమైన ఫైబర్‌లో ఎనిమిది శాతం లభిస్తుంది.
అంతేకాదు.... కాకర కాయ తీసుకోవడం వల్ల జింక్, పొటాషియం, ఐరన్ తదితర ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
కాకరకాయ వినియోగం షుగర్ వ్యాధి నియంత్రణకు ఔషధంగా పని చేస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ సాఫీగా సాగేలా చేస్తుంది.
అయితే గర్భిణి స్త్రీలు మాత్రం కాకర కాయ కూరకు దూరంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి