చలికాలంలో వీటిని తింటే మీ ఆరోగ్యం పదిలం..

29 October 2023

చలిగాలుల వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి శ్వాస కోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

చలికాలంలో సొరకాయ తప్పనిసరి. దీనిలో ఉండే అధికశాతం నీరువల్ల సులభంగా జీర్ణం అవుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, జింక్‌, వంటి పోషకాలు ఉన్నాయి.

కప్పు తాజా కాకర ముక్కల నుంచి రోగనిరోధక శక్తిని పెంచే 93 శాతం సి విటమిన్‌ లభిస్తుంది. చలికాలంలో ఆరోగ్యం కోసమా ఇది తీసుకోవాలి.

కాకరలోని ఫైబర్‌ జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. నులిపురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

చలికాలంలో కంద పుష్కలంగా లభిస్తుంది. కంద దుంప‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

కందలో ఎక్కువగా ఉండే ఫైబర్‌ శ‌రీరంలో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వును క‌రిగిస్తుంది. ఇది తింటే ఆరోగ్యానికి మేలు.

ముల్లంగి తినడం వల్ల కంటిచూపు బాగుంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటాలంటే విటమిన్‌ A పుష్కలంగా లభించే క్యారెట్‌ తీసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది.