TV9 Telugu

ఆరోగ్యం గురించి ఎందుకు చింత.. నానబెట్టిన శనగల నీటితో లాభమే అంతా..

20 Febraury 2024

శనగలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు నిపుణులు.

నానబెట్టిన శనగల నీటిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, వంటి ఆరోగ్యకరమైన ఖనిజాలు చేరుతాయి.

మీకు ఇష్టమనుకుంటే.. ఆ నీటితోపాటు.. అందులో శనగలను కూడా తినవచ్చు. ఇవి కూడా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

నానబెట్టిన శనగ నీటిలో సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ మన జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.

శనగలు లేదా శనగపప్పును రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.

నానబెట్టిన శనగల నీటిలో ఉండే పోషకాల వల్ల శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అనేక రకాల విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

నానబెట్టిన శనగల నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.