లెమన్ గ్రాస్ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

TV9 Telugu

17 January 2024

లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి.

లెమన్ గ్రాస్ లో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ మినరల్స్ శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.

ఆహ్లాదకరంగా ఉండే నిమ్మగడ్డి సువాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయకారిగా ఉంటుందిని చెబుతున్నారు నిపుణులు.

ప్రతిరోజూ లెమన్ గ్రస్ టీని తీసుకుంటే నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోయి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

లెమన్ గ్రాస్ లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయని అంటున్నారు వైద్యులు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి సంరక్షిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

నిమ్మగడ్డి టీని ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే అన్ని చర్మ సమస్యలు తగ్గిపోయి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

నిమ్మగడ్డి మంచి సువాసన కారణంగా నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తొలగిపోతుంది. దీన్ని రోజు తీసుకొంటే నోటి ఆరోగ్యం పదిలం.