ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం మంచిదా.. మాంసాహారం మంచిదా..
10 December 2023
చాయ్‌లోని యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వాదన ఎప్పటి నుంచో ఉన్నది. చాయ్‌లో అనేక రకాలు ఉన్నప్పటికీ అల్లంచాయ్‌కి ఉన్న స్పెషాలిటీయే వేరు.
అల్లం చాయ్‌లోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అనేక రకాల మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలకు, అజీర్తితో కడుపు నొప్పి వచ్చినా, ఇబ్బంది పెట్టే తేన్పులు వస్తున్నా అల్లం టీ తో చెక్ పెట్టొచ్చు.
అల్లం వల్ల ఊపిరితిత్తుల వాపు తగ్గి, శ్వాస తేలికపడుతుంది. దీనిలోని విటమిన్-సి, అమైనో యాసిడ్స్ లాంటి పోషకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి.
అల్లం చాయ్ గుండె సమస్యలను నివారిస్తుంది. కీళ్లు, కండరాలలో వచ్చే వాపును అరికట్టే సుగుణం అల్లం టీలో మెండుగా ఉంటుంది.
ప్రయాణంలోనో, తలనొప్పితోనో కలిగే వికారాలకు అల్లం టీ మంచి మెడిసిన్‌గా పని చేస్తుందని చెబుతున్నారు వైద్యులు.
రుతుస్రావ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి అల్లం టీ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తరుచూ అల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి