కొత్తిమీర నీరుతో సమస్యలు ఆమడ దూరం.. 

TV9 Telugu

24 July 2024

కొత్తిమీర, ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఇ పుష్కలంగా ఉన్నాయి.

కొత్తిమీర నీటిని తాగడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతుంది.

కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి కొత్తిమీర నీరు చాలా ఉపయోగపడుతుంది. ఈ నీటిలో జీవక్రియను వేగవంతం చేసే అనేక అంశాలు ఉన్నాయి.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కొత్తిమీర నీరు తీసుకుంటే పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రయత్నించే వారికి, ఋతు తిమ్మిరితో బాధపడేవారికి ఉదయాన్నే కొత్తిమీర నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

అలాగే, కొత్తిమీర నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.