కొబ్బరి నీళ్లతో సబ్జా గింజలు.. మీ ఆరోగ్యానికి అండదండలు..

TV9 Telugu

11 February  2024

కొబ్బరి నీళ్లకు సబ్జా గింజల్ని జోడిస్తే వచ్చే ఉపయోగాలు అద్భుతం అంటున్నారు నిపుణులు. సబ్జా గింజల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది.

వీటిని కొబ్బరి నీళ్లకు జోడిస్తే శరీరానికి కావాల్సినంత నీరు, ఎలక్ట్రోలైట్స్ అందుతాయని చెబుతున్నారు వైద్యులు.

అంతే కాకుండా సహజసిద్ధమైన పద్ధతిలో దేహం చల్లబడుతుంది. కొబ్బరి నీళ్లల్లో సాల్యుబుల్ ఫైబర్‌తో పాటూ యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి.

తరచూ డీహైడ్రేషన్ బారిన పడే వారికి ఇది దివ్యౌషధం. బాగా నానిన గింజలను గ్లాసు కొబ్బరి నీళ్లల్లో వేసి కలిపి తాగేయాలి.

సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఎంతగానో సహకరిస్తుంది.

సబ్జా గింజల యాంటీఆక్సిడెంట్ల కారణంగా వీటిని తీసుకుంటే శరీరంలోని విషతుల్యాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ముందుగా అరకప్పు నీళ్లల్లో మరో అర టీస్పూను సబ్జా గింజల్ని వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలి.

ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు తాగితే సూర్యతాపం నుంచి తట్టుకోవడం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.