బ్లాక్ వాటర్ ప్రయోజనాలు సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట.
అలానే బాడీని హైడ్రేటెడ్, ఫిట్‌గా ఉంచటంలో పనిచేసే ఈ బ్లాక్ వాటర్‌లో ఉండే 70% ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది.
శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది.
బ్లాక్ వాటర్‌ని తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. అలాగే శరీర వేడిని తగ్గిస్తుంది.