జ్యూస్‌లలో కెల్లా ఏబీసీ జ్యూస్ అయితే ఆరోగ్యానికి అన్ని విధాల మేలు చేస్తుంది. యాపిల్, బీట్ రూట్, క్యారెట్.. మూడింటితో కలిపి చేసే జ్యూస్ ను ఎబిసి జ్యూస్ అంటారు.
ఉదయాన్నే ఎబిసి జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
క్యారెట్, బీట్రూట్ లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి.
క్యారెట్స్, యాపిల్స్ లోని ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇది మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది.
బీట్రూట్ లలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
యాపిల్స్, క్యారెట్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఎబిసి జ్యూస్ తాగితే వేగంగా కోలుకుని ఇన్పెక్షన్ల నుండి కూడా బయటపడతారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కలిసి రక్తాన్ని శుద్ది చేస్తాయి.