ఆరోగ్యం గురించి టెన్షన్ పడకండి.. అలాంటి వారికి వరం కరివేపాకు.. 

11 October 2023

కరివేపాకులో ఎన్నో పోషకాలతోపాటు ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. కరివేపాకులోని లక్షణాలు ఆహారం వాసన, రుచిని పెంచుతాయి.

కరివేపాకులో ఔషధ గుణాలు 

కరివేపాకును వేయించిన వెంటనే దాని పరిమళం ఇంటింటా వ్యాపిస్తుంది. దానిలోని పోషక విలువల కారణంగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. 

ఆరోగ్యానికి ఉపయోగకరం

కరివేపాకులో భాస్వరం, ఇనుము, కాల్షియం, విటమిన్ సి, ఎ వంటి అనేక పోషకాలు దాగున్నాయి. అందుకే వైద్య నిపుణులు కరివేపాకును తినాలని సూచిస్తుంటారు.

అనేక పోషకాలు

కరివేపాకును తినడం వల్ల శరీరం డిటాక్స్‌ అవుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. డయాబెటిక్ రోగుల చక్కెరను నియంత్రించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. 

డయాబెటిక్ రోగులకు మేలు

రక్తహీనత (హీమోగ్లోబిన్ లోపం) సమస్య ఉన్న వారు కరివేపాకును తినడం మంచిది. దీనిలోని ఐరన్‌, విటమిన్ సి రక్తహీనతను తొలగించి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

రక్తహీనతలో ప్రయోజనకరం

కరివేపాకులను ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, తిమ్మిరి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

చాలా సార్లు వికారం, వాంతులు వంటి సమస్యలు ఉదయాన్నే మొదలవుతాయి. కరివేపాకు మీకు మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

మార్నింగ్ సిక్ నెస్..

కరివేపాకు తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా మీ బరువును మెయింటైన్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గుతుంది..

కరివేపాకును ఆహారంతోపాటు.. పచ్చిగా నమిలి తినడం మంచిది. మీ ఆహారంలో చేర్చుకోవడంతో పాటు, ప్రతిరోజూ ఉదయం ఐదు నుంచి ఆరు కరివేపాకులను నమలి తినండి.. 

కరివేపాకు ఎలా తినాలి