TV9 Telugu

మొలకలతో అనారోగ్యానికి గుడ్ బై..

23 Febraury 2024

రోజూ మొలకలు తినడం వల్ల కేవలం ప్రోటీన్ అందడమే కాదు.. శరీరానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మొలకెత్తిన ధాన్యాలు వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.దీనిలో సల్ఫోరాఫేన్ టైప్2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే క్యాన్సర్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు మంచిది.

మొలకలు యాంటీ హైపర్లిపిడెమిక్‌గా పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది.

మొలకెత్తిన గింజలను తీసుకుంటే, చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

మొలకెత్తిన ధాన్యాలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

ఐరన్ తో పాటు, తృణధాన్యాలలో అధిక మొత్తంలో విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు.

మొలకెత్తిన ధాన్యాలు తీసుకోవడం వల్ల కంటికి కూడా మేలు జరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి రెండూ ఉంటాయి.