మీ ఆహారం పాలకూర చాలు.. మీ లైఫ్ అంత చిల్..
TV9 Telugu
14 August 2024
పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఐరన్, కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ప్రోటీన్లు, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
పాలకూరతో రకరకాల వంటకాలు చేయవచ్చు. పాలకూరను కూరగానే కాకుండా రుచికరమైన పకోడీలు కూడా చేసుకుని తినొచ్చు.
పాలకూర తినడం వలన.. ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పాలకూరలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి.
ఇది కాకుండా, ఇందులో పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది.
పాలకూరలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది.
ఇది మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. పాలకూర తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని టాక్సిన్‌లను తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అనేక రకాల క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.
పాలకూరలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్‌లు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి