TV9 Telugu
నానబెట్టిన వేరుశెనగ ఉదయాన్నే తింటే సూపర్ బెనిఫిట్స్
22 Febraury 2024
వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అంటారు. వేరుశనగలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి కాబట్టి అవి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి ఈ గింజలను నీటిలో నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నానబెట్టిన వేరుశెనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నానబెట్టిన వేరుశెనగలను రోజూ ఉదయం తింటే రక్తప్రసరణ మెరుగవుతుంది.
వేరుశెనగలో పుష్కలంగా ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కంటి చూపును కాపాడి జ్ఞాపకశక్తి తగ్గకుండా మెరుగుపరుస్తాయి.
క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న వేరుశెనగలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎముకలు బలపడతాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అనేక అంటు వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగకరంగా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి