ఉల్లికాడలు ఆ సమస్యలకు యమరాజు.. 

22 September 2024

TV9 Telugu 

లేత ఉల్లికాడలు గొప్ప రుచిని, పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. కెలరీలు, కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.

ఉల్లికాడలలో A, B2, C, K విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ ఉంటాయి.

ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.

ఉల్లికాడలు కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి దివ్య ఔషధం.

ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి.

వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది.

ఉల్లికాడలను ఎక్కువగా వాడేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

వీటిలోని ఫొలేట్లు గుండె, రక్తనాళాలకు మంచిది. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ బాధితులకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.