శీతాకాలంలో కుంకుమ పువ్వుతో ఆ సమస్యలు దూరం..

14 December 2023

చలికాలంలో అల్లం, ప‌సుపు వంటి వంటింటి ఔష‌ధాల‌తో ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడే రోగ నిరోధక శక్తీ బ‌ల‌ప‌డుతుంది.

అయితే శీతాకాలంలో కుంకుమ పువ్వు వైరస్‌లు, బ్యాక్టీరియాలతో సూప‌ర్ హీరోలా పోరాడుతుందంటున్నారు నిణుపుణులు.

చ‌లికాలంలో వచ్చే ప‌లు రకాల వైరల్‌ వ్యాధులను కుంకుమ పువ్వు ద‌రిచేర‌నీయ‌ద‌ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కేస‌ర్‌గా పేరొందిన కుంకుమ‌పువ్వు యాంటీఆక్సిడెంట్ల ప‌వ‌ర్‌హౌస్‌. దినిలో ఉండే క్రొసెటిన్ అనే ప‌దార్ధం కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండె స‌మ‌స్య‌ల‌ను అరికడుతుంది.

కుంకుమ‌పువ్వులో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప‌దార్ధాలు చలికాలంలో వచ్చే ఆస్త్మా, అల‌ర్జీలను నివారిస్తుంది.

శీతాకాలం రోజుల్లో కుంకుమ‌పువ్వుతో చేసిన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవ‌డం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

చలికాలం సమయంలో కుంకుమ‌పువ్వు టీ, కేస‌ర్ దూద్, కుంకుమ‌పువ్వు-తేనె కలయికలు సేవిస్తుండాలని నిపుణులు అంటున్నారు.

అలాగే జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు కుంకుమ‌పువ్వుతో ఆవిరి పట్టుకుంటే ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది.