మిరియాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గి ఫిట్‌గా ఉంటాం అదెలా అంటారా?
09 September 2023
మిరియాల పై పొరలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ కొవ్వుల్ని విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి బరువు తగ్గి ఫిట్ గా కూడా ఉంటాం.
ధనియాలు, మిరియాలు, శొంఠి, ఆవాలు, జీలకర్ర, పసుపు, బిర్యానీ ఆకులు.. వీటన్నిటితో కూడిన పోపుల డబ్బా మన చేతిలో మందుల సంచి లాంటిది.
మిరియాలు సహా ప్రతి దినుసుకూ ఔషధ విలువలు ఉన్నాయి. అన్నీ కలిస్తే ఆ శక్తి ఇనుమడిస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది.
మిరియాలతో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. అంతేనా, మలబద్ధకం పరార్. నోటి దుర్వాసన దూరం అవుతుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
మిరియాలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. . సాధ్యమైనంత వరకూ తాజాగా పొడి చేసుకున్న మిరియాలే ఉత్తమం.
ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
మిరియాలు కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. అన్ని ఆరోగ్యకరమైనవే.
మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా. ఇప్పట్టినుంచి మిరియాలను మీ రోజువారి డైట్ లో చేర్చుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి