లెట్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

08 November 2023

ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. డైసీల ఆస్టెరేసి కుటుంబానికి చెందిన లెట్యూస్‌ మాత్రం పోషకాల గనిగా చెబుతున్నారు నిపుణులు.

యూరప్‌, అమెరికా దేశాలలో ఎక్కువగా వినియోగించే లెట్యూస్‌ ఆకుకూరను యునాని వైద్యంలో ఉపయోగిస్తుంటారు వైద్యులు.

సూప్‌లు, శాండ్‌విచ్‌ల వంటకాల్లో ఎక్కువగా లెట్యూస్‌ను వినియోగిస్తుంటారు. లెట్యూస్‌లో కార్బ్స్‌ తక్కువగా, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.

లెట్యూస్‌ ఆకుకూరలో నీటి శాతం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని డీ హైడ్రేట్‌ కాకుండా ఉంచుతుందని చెబుతున్నారు.

లెట్యూస్‌ ఆకుకూరలో అధికంగా ఉండే ప్రొటీన్లు, లిపోక్సిజనేస్ వంటివి శరీరంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

వాపు, ఎముకలలో నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి లెట్యూస్‌ ఔషదంలా పనిచేస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు.

లెట్యూస్‌ అకూకూర మెదడులోని న్యూరానల్ సెల్ మరణాన్ని నియంత్రించడంలో సాయ పడతాయన్నది వైద్య పరిశోధకుల మాట.

లెట్యూస్‌ కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కంటి చూపు మెరుగయ్యేలా చేస్తుంది. ఎముకలు కూడా బలంగా మారతాయి.