నిమ్మ‌రసంతో మీ ఆరోగ్యం పదిలం..

12 September 2023

పొద్దున్నే నిద్ర లేవగానే చాలా మంది కాఫీ, టీ తాగనిదే బెడ్‌ మీది నుంచి దిగరు. వాటి బదులుగా నిమ్మరసం తాగడం బెటర్‌ అంటున్నారు నిపుణులు.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని పొద్దున్నే ఏమీ తినకముందు తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.

నిమ్మకాయ‌ల్లో పుష్కలంగా ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని మరింత రెట్టింపు చేస్తుంది. ఒక నిమ్మ‌కాయ‌లో 18.5 మిల్లీగ్రాముల సి విట‌మిన్ దొరుకుతుంది.

మ‌న‌ శరీరానికి ప్రతీరోజు 60 నుంచి 90 మిల్లీగ్రాముల విట‌మిన్ సి అవ‌స‌రం పడుతుంది. ఒక నిమ్మ‌కాయ‌లో మన శరీరానికి కావాల్సిన 20 శాతం విట‌మిన్ సి ఉంటుంది.

పొద్దున్నే నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోగొడుతుంది. అజీర్తి సమస్యను పొగొట్టి, జీర్ణ వ్య‌వ‌స్థను మెరుగుపరుస్తుంది.

నిమ్మ‌ర‌సంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌కుండా కాపాడుతుంది. నిమ్మరసం సేవించడం వల్ల కిడ్నీల్లో చిన్న‌పాటి రాళ్లు ఉంటే క‌రిగిపోతాయి.

నిమ్మ‌రసం నోటి దుర్వాస‌న పోగొడుతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు పోయి దంతాలు మరింత దృఢంగా తయారవుతాయి.

గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్న వారు మాత్రం నిమ్మ‌ర‌సాన్ని తాగ‌కూడ‌దు. ఇక ఏ స‌మ‌స్యా లేని వారు నిరభ్యంత‌రంగా నిత్యం నిమ్మ‌ర‌సం తాగ‌వ‌చ్చు.