మెంతికూర తినడం వల్ల ప్రయోజనాలు..

24 November 2023

చలికాలంలో మెంతికూర తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ శరీరానికి లభిస్తాయి.

హార్మోన్ల సమస్యలతో బాధపడే పురుషులు, మహిళలు మెంతికూర తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మెంతులు పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను మెరుగ్గా చేస్తాయని ఆరోగ్య పరిశోధకులు గుర్తించారు.

మెంతి రసాన్ని రెగ్యులర్‌గా ఆరు వారాల పాటు తీసుకుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం బలపడుతుందని అంటున్నారు.

అధికబరువుతో బాధపడే వారు మెంతులని తీసుకుంటే సమస్య దూరం అవుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తాయి.

ఆకలిని కంట్రోల్ చేసి జీవక్రియని మెరుగ్గా చేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్‌తో కేలరీలు తక్కువగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

షుగర్ ఉన్నవారు 10 గ్రాముల మెంతి ఆకుల్ని గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసుకుంటే టైప్ 2 షుగర్ తగ్గిపోతుంది.

మహిళలు మెంతి కూరని నెలసరి టైమ్‌లో ఎలా అయినా తీసుకుంటే చాలా వరకూ కడుపునొప్పి బాధ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.