చలికాలంలో ఎన్నో సీజనల్ ఫ్రూట్స్ మన శరీరానికి మేలు చేస్తుండగా వాటిలో సీతాఫలం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ స్వీట్ ఫ్రూట్ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాల గనిగా చెప్పవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
విటమిన్ సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే శీతాఫలాలు రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరుస్తాయి
సీతాఫలం పండులో ఉండే ఏ విటమిన్లు, బీ6... గుండె, ఊపిరితిత్తులు మెరుగ్గా ఉండేందుకు కీలకంగా పని చేస్తాయి.
కుంగుబాటు సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడతుంది. దీనిలో ఫైబర్ మలబద్ధకం దూరమై జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
ఈ పండు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మారుతుంది. ఫ్లేవనాయిడ్లు, ఫెనోలిక్ కాంపౌండ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
యాంటీ ఆక్సిడెంట్లు... ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గేలా చేస్తాయి. క్యాన్సర్, హృద్రోగం వంటి తీవ్ర అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది.
సీతాఫలాలు తరచూ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో పొటాషియం అధిక రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.