కరివేపాకు టీతో ఈ సమస్యలన్నీ ఫసక్..
TV9 Telugu
06 June 2024
కరివేపాకులో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, విటమిన్ ఎ, కెరోటిన్, విటమిన్ సి ఇలా ఎన్నో పోషకాలు కారణంగా దీన్ని విరివిగా వాడుతారు.
కరివేపాకు ఆహారం రుచిని పెంచడం మాత్రమే కాదు శరీరానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
ఒక గ్లాసు నీటిలో 20 నుండి 30 కరివేపాకులను మరిగించి, నీరు సగం అయ్యాక దానిని ఫిల్టర్ చేయండి. అందులో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగాలి.
కరివేపాకు టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
దీనిలో ఉంటె యాంటీఆక్సిడెంట్లలో ఉండే మూలకాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
అధిక బరువు ఉన్నవారు కరివేపాకుతో చేసిన టీని తాగితే బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుందని అంటున్నారు నిపుణులు.
ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది.
గర్భధారణ సమయంలో టీ తీసుకుంటే వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి