వంకాయతో ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. 

TV9 Telugu

20 July 2024

వంకాయలో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు విటమిన్ ఏ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగుపడుతుంది.

నిత్యం మన ఆహారం లో వంకాయలను విరివిగా తీసుకుంటే కంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టినట్టే అంటున్నారు నిపుణులు.

వంకాయలలో ఫైబర్ ఎక్కువగా, కార్బో హైడ్రేట్ లు తక్కువగా ఉన్నందున టైప్ 2 డయాబెటిస్ నివారించడం లో చాల వరకు ఉపయోగపడుతుంది.

దానికి తోడు వంకాయల్లో కేలరీలు కూడా చాల తక్కువగా ఉంటాయి. తిన్నాక జీర్ణం కూడా త్వరగా అవుతుంది. దీంతో కడుపు సమస్యలు దరిచేరవు.

బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడంలో కూడా వంకాయలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి.

వంకాయలను తరుచు తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు తగ్గుతుంది.

వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇంత ఆరోగ్యకర విలువలు ఉన్న వంకాయలను మిస్ అవొద్దు. రెగ్యులర్ గా వీటిని తీసుకోండి.