శీతాకాలంలో నల్లమిరియాలతో ఆరోగ్య లాభాలు..

TV9 Telugu

07 January 2024

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాలతో పాటు విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది.

వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూనే ఉంటాయన్నా విషయం తెలిసిందే.

నల్లమిరియాలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత పడిపోకుండా ఉంటుంది.

నల్ల మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాల కారణంగా శ్వాస కోశ వ్యాధులు రాకుండా ఉంటాయి.

శీతాకాలంలో చలి కారణంగా దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నల్ల మిరియాలు వల్ల ఆరోగ్యానికి మేలు.

ఈ సమయంలో మిరియాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే.. శ్వాస కోశ సమస్యలు, ఉబ్బసం కూడా తగ్గుతాయన్నది నిపుణుల మాట.

నల్ల మిరియాల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

గ్యాస్, కడుపులో నొప్పి, మల బద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా సయాటికా సమస్యను కూడా తగ్గిస్తుంది.