నల్ల యాలకులతో ఆ సమస్యలకు పిండం..
TV9 Telugu
22 August 2024
ఆకుపచ్చ యాలకులతో పోలిస్తే.. నల్లయాలుకలు కొంచెం పెద్దగా, ముడతలుగా ఉంటాయి. ఎక్కువ సువాసనతో సిట్రస్, యూకలిప్టస్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి.
నల్లయాలకులు మన ఆహారంలో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల యాలకుల గింజల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయని పోషకాహార పరిశోధకులు గుర్తించారు.
ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
శరీరం నుంచి వ్యర్థాలు, విష పదార్థాలు తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేయడంలో నల్ల యాలకులు బాగా పని చేస్తాయి.
నల్ల యాలకులు ఆహారంలో తీసుకోవడం ద్వారా లివర్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
నల్ల యాలకులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకలి మందగించినప్పుడు ఈ యాలకుల్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు తలెత్తవు.
నల్ల యాలకులు చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. నల్ల యాలకులు నమిలితే.. నోటి దుర్వాసన పోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి