క్రాన్‌బెర్రీస్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
క్రాన్బెర్రీస్ లో ఉండే సహజ సమ్మేళనాలు కడుపు పూతలు, పొట్టలో పుండ్లకు సంబంధించిన బాక్టీరియాను అరికడుతుంది.
క్రాన్బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్ల వ్యాధి, కావిటీలలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది.
క్రాన్‌బెర్రీస్‌లోని ఉన్న ప్రోయాంతోసైనిడిన్‌లు ఎలాంటి బ్యాక్టీరియాను దంతాలకు అంటుకోకుండా నిరోధిస్తాయి.
క్రాన్‌బెర్రీస్ తరుచూ తినడం వల్ల దంతాల మీద గార ఏర్పడడాన్ని తగ్గించి దంతాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.