వాము మీ డైట్ లో ఉండాగా.. అనారోగ్యం రన్ ఔటేగా..

TV9 Telugu

04 June 2024

మీరు బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆహారంలో వామును ఉపయోగించవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిరోజూ వామును తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుందని వైద్యులతో సహా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వామును తీసుకుంటే అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ నుంచి ఉపశమనం కోసం వాము గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అర టీస్పూన్ వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి రోజూ తాగడం వల్ల బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది.

వాము టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే వాము టీని తీసుకోవచ్చు.

వాము టీ తయారీ కోసం ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకొని అర టీస్పూన్ వాము వేసి 2 నుంచి 3 నిమిషాలు వేడిచేయండి. ఆ తర్వాత ఈ నీటీని ఫిల్టర్ చేసి తాగాలి.

వాము తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా.. ప్రతిరోజూ మీరు వామును తీసుకోవడం వల్ల వారంలో రిజల్ట్ కనిపిస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.