TV9 Telugu

బియ్యం కడిగిన నీళ్లతో ఆ సమస్యలు దూరం..

04 March 2024

తరుచు మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో రకాల అనారోగ్యాలకు, చిట్కాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే లభిస్తుంటాయి..

చాలా సార్లు మనం పనికిరానివిగా పారేసే వస్తువుల్లోనే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.అందులో బియ్యం కడిగిన నీళ్లు ఒకటి.

బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలుంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. రైస్ ప్రపంచవ్యాప్తం గా పరిచయమైన ఫుడ్.

ఈ వాటర్ లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బియ్యం కడిగిన నీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు , ఉపయోగాలు తెలిస్తే.. మీరు రైస్ వాటర్ ఇకపై అస్సలు పారబోయరు.

బియ్యం కడిగిన నీటిలో కాటన్ లేదా శుభ్రమైన గుడ్డను ముంచి ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుందట. స్కిన్ ఫేషియల్ గా ఉపయోగించవచ్చు.

ముఖం ఎర్రబారడం, స్కిన్‌ అలర్జీలు వంటి సమస్యలు ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కుంటే ఫలితాలు ఉంటాయి.

ఈ నీటిని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగడమే కాదు హెయిర్‌ ఫాల్‌ , డాండ్రఫ్ కూడా కంట్రోల్‌ అవుతుందట.

బియ్యం కడిగిన నీటిలో లావెండర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టును కడగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

స్త్రీలు తెల్ల రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటే ఈ రైస్ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు.