మీకు ఈ అలవాట్లు ఉంటే అనారోగ్యం రమ్మన్నా రాదు...

15 September 2023

మన శరీరానికి తి ముఖ్యమైంది నీరు. నీటిని సరిపడా తాగడం వలన శరీరంలోని అవయవాలు చురుకుగా పని చేస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం అత్యంత అవసరం. ప్రతిరోజు పద్దతి ప్రకారం వ్యాయమం చేయడం వలన డాక్టర్‌ వద్దకు వెళ్లె అవసరం రాదంటున్నారు నిపుణులు.

పోషకాహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, ఆరోగ్యం ఒక దానికొకటి విడదీయరాని సంబంధం ఉంటుంది. కనీసం 20 నిమిషాలు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే జీర్ణం బాగా అవుతుంది.

జీర్ణకోశ సమస్యలు లేకుండా జాగ్రత్త పడటం వలన తీసుకున్న ఆహరం సంపూర్ణంగా అరుగుతుంది. కడుపులో ఆహరం జీర్ణం కాకపోవడం వలన మరిన్ని సమస్యలకు తావిస్తుంది.

మానసిక సమస్యల వల్ల శారీరక సమస్యలు పెరుగాతాయి. ముఖ్యంగా మెదడు పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైనా పడుతుంది.

ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాహారంతో పాటు బాగా నిద్రపోవాలి. నిద్ర లేమి వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం పూట ఎండను ఆశ్వాదించాడం వలన శరీరానికి సరిపడ విటమిన్‌ డి కావాల్సినంత దొరుకుతుంది. విటమిన్‌ డి అనేది ఎండ నుంచి వచ్చే విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు.

రోజువారీగా క్రమక్రమంగా మొబైల్‌ వినియోగం తగ్గించాలి. మొబైల్‌ ఫోన్‌ను అదేపనిగా వాడటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మెదడు, నరాలు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

శరీరం ఆరోగ్యం ఉండాలంటే డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డ్రైఫ్రూట్స్‌లో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.