వేపతో కురుల సమస్యకు ఫుల్స్టాప్..
TV9 Telugu
13 August 2024
వేప ఆకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, దాహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వేప గాయాలను శుభ్రపరుస్తుంది, నయం చేస్తుంది. వికారం, వాంతుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.
వేప పొడిని నీరు లేదా తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి చర్మం లేదా గాయాలపై పూత పూయవచ్చు. వేప నీటి కషాయాన్ని హెర్బల్ టీగా తాగవచ్చు.
వేప పొడి/వేప ఆకులను వేడి నీళ్లలో వేసి మరగ పెట్టి స్నానం చేస్తే, చర్మ సమస్యలు పరారవుతాయి. దీన్ని తరచు ఉపయోగించండి.
వేప ఆకులను నీళ్లలో మరిగించి, ఆ నీళ్లు చల్లారిన తర్వాత జుట్టుకు వాడితే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
మొటిమల నివారణకు వేప పొడిని గంధం, గులాబి, పసుపు, మంజిష్ట వంటి మూలికలతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు.
రోజూ పరగడుపున 7-8 వేప ఆకులను 2 వారాల పాటు తింటే రక్తం శుద్ధి అవుతుంది. పళ్లు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించవచ్చు.
మధుమేహం, చర్మ సమస్యలు, రోగనిరోధక శక్తి, జ్వరం మొదలైన వాటికి వేప ఏ రూపంలోనైనా (పొడి, రసం) తీసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి