ఈ ఆహారాలతో నేత్రాల ఆరోగ్యం పదిలం..
TV9 Telugu
17 January 2024
క్యారెట్, పాలకూర, ఫ్యాటీఫిష్, గింజలు, సిట్రస్ పండ్లు వంటి ఆహార పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
క్యారెట్‌లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి రెటీనా, కంటిలోని ఇతర భాగాలు సజావుగా పనిచేయడానికి విటమిన్ ఎ అవసరం.
బీటా-కెరోటిన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కంట్లో మచ్చలు, కంటిశుక్లం వంటి సమస్యల నుండి కూడా రక్షిస్తాయి.
లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలకు పవర్‌హౌస్ పాలకూర. ఇవి సహజంగా కంటికి సన్ గ్లాసెస్ లాగా పనిచేస్తాయి.
పాలకూరలో ఎక్కువగా ఉండే ఈ పోషకాలు కళ్ళు దెబ్బతినకుండా కాంతి కిరణాలు, తరంగ ధైర్ఘ్యాల నుండి కళ్ళను కాపాడతాయి.
సాల్మన్, ట్యూనా, మాకేరెల్ చేపలలో ఒమెగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇది రెటీనా కణాల నిర్మాణానికి, పొడి కళ్లకు చాలా మంచిది.
బాదం, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ వయసు వల్ల వచ్చే కంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి.
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్-సి కళ్లను, కంటి కణజాలాలను బాగు చేస్తుంది. కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి