మెదడు జ్ఞాపకశక్తిని పెంచడానికి తినాల్సిన ఆహారాలు.. 

TV9 Telugu

07 January 2024

బ్రెయిన్ పై ఎక్కువగా ఒత్తిడి పెట్టడం వల్ల మెమరీపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యారోగ్య నిపుణులంటున్నారు.

చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇలా ఉండే కొద్దీ జ్ఞాపక శక్తి కూడా నశిస్తుందని చెబుతున్నారు.

అయితే మీ డైట్ లో పలు రకాల ఆహారాలను చేర్చుకోవడం వల్ల మెదడుకు పదును పెట్టొచ్చని సూచిస్తున్నారు వైద్యులు.

డార్క్ చాక్లెట్ లో అధికంగా ఉండే ఫ్లేవనాయిడ్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని తగ్గించి, మెదడుకు మేలు చేస్తాయి.

బ్రోకలీలో కూడా జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి, పుచ్చకాయ గింజల్లో కూడా మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. జ్ఞాపక శక్తిని పెంచే జింక్, ఐరన్, కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

నట్స్ తినడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మెరుగ్గా పని చేస్తాయి. వీటిలో ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి.

సాల్మన్ చేపల్లో ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది.