శీతాకాలంలో ఇలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం పదిలం..

24 November 2023

శీతాకాలంలో స్వీట్లు స‌హా ఇతర వంట‌కాల‌ను అధికంగా తీసుకోవ‌డం వల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

చలికాలంలో ఇంటిలో త‌యారుచేసిన స్వీట్స్‌ను ప‌రిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇంట్లో త‌యారుచేసుకునే స్వీట్స్‌లో అనారోగ్యం కలిగించే రిఫైన్డ్ షుగ‌ర్స్‌, ప్రిజ‌ర్వేటివ్‌లు వాడకపోవడం ఉత్తమం.

హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌ను కూడా వాడకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రిఫైన్డ్ షుగ‌ర్‌కు బ‌దులు తాజా పండ్ల ర‌సం, డేట్స్‌, తేనె, బెల్లం వంటి ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల‌ను ఎంపిక చేసుకోవాలి.

ఓట్స్ ర‌బ్డి, లౌకి హ‌ల్వా, యాపిల్ ప్యాన్‌కేక్స్‌, యాపిల్ ఖీర్‌, డేట్స్‌, న‌ట్స్ రోల్‌, అంజీర్ రోల్‌, రాగి ల‌డ్డు వంటి స్వీట్స్ మేలు.

మైదాకు ప్ర‌త్యామ్నాయంగా మిల్లెట్ ఫ్లోర్, గోధుమ పిండిని వాడితే ఫైబ‌ర్‌తో పాటు అద‌నంగా విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌ అందుతాయి.

శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని స‌మ‌కూర్చ‌డంతో పాటు ఆరోగ్య‌క‌ర కొవ్వుల కోసం బాదం, జీడిప‌ప్పు వంటి న‌ట్స్ ను ఆహారంలో చేర్చుకోవాలి.