ఈ ఆహారాలతో డిప్రెషన్ కి గుడ్ బై..

29 August 2023

ప్రస్తుత రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న వాటిల్లో డిప్రెషన్ ఒకటి. పని ఒత్తిడి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.

ఈ సమస్య పోవడం కష్టతరమని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే దీని నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొన్ని ఆహార పదార్థాలు ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి అంటున్నారు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించారు పరిశోధకులు. దీని కారణంగా మానసిక స్థితి మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

బ్రొకోలిలో విటమిన్ B6, ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇది తింటే డిప్రెషన్ దూరమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

చిలగడదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. ఇది తినడం వల్ల  ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మానసిక స్థితి రిఫ్రెష్ అవుతుంది.

చియా విత్తనాల తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనులు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉన్నాయి.

ఇందులో ఉన్న పోషకాలు మెదడుకి ఎంతో ఉపయోగపడతాయి. ఇది తీసుకుంటే ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది.