ఈ ఆహారాలతో అధిక కొలెస్ట్రాల్‌ సమస్య దూరం..

14 December 2023

కొలెస్ట్రాల్‌ అధికంగా పేరుకుపోతే మాత్రం అది ఆరోగ్యానికి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంది. ఇది గుండెకు ర‌క్త‌స‌ర‌ఫ‌రాను బ్లాక్‌ చేస్తుంది.

శరీరంలో కొవ్వు వల్ల హృద్రోగ సమస్యలు, గుండుపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సరైన పాల్లలో మెయింటెన్ చేయ‌డంలో ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవలి.

మ‌నం రోజూ ఏం తింటున్నామ‌నే దానిపై మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండాలంటే జంక్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను దూరం పెట్ట‌డం అతిముఖ్యమని అంటున్నారు.

అలాగే మనం రోజూ తీసుకునే ఆహారంలో అధిక క్యాల‌రీలు లేకుండా చూసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్య‌క‌ర ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను త‌గ్గించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

ప్రతిరోజూ ఉద‌యాన్నే ఆరోగ్య‌క‌ర పానీయాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణ‌లో ఉంచుకోవ‌చ్చు.

గ్రీన్ టీ, బ్లాక్ టీ, బీట్రూట్ జ్యూస్‌, ఆరెంజ్ జ్యూస్‌, లెమ‌న్ వాట‌ర్‌ వంటి పానియాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.