గుండెపై చింత ఎందుకు దండగ.. ఈ ఫుడ్స్ ఉన్నాయిగా అండగా..
TV9 Telugu
13 May 2024
సాధారణంగా తరుచు చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్యారోగ్య నిపుణులు.
చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.
ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి.
పాలకూర, కొత్తిమీర, ర్యాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి.
రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.
ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ లో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరు మెరుగుపరుస్తాయి.
ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.