చాలాకాలంలో ఎనర్జీ లెవల్స్ ను పెంచే ఆహారాలు..

01 January 2024

TV9 Telugu

శీతాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్ లో చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పనీ త్వరగా చేయాలనిపించదు.

శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందకపోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

అయితే బద్ధకాన్ని దూరం చేసుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు సహాయ పడతాయని సూచిస్తున్నారు నిపుణులు.

బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. చలి కాలంలో బ్లూ బెర్రీస్‌ తీసుకోవడం వల్ల బద్దకం పోయి హుషారుగా ఉంటారు.

బ్లూ బెర్రీస్‌ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, ఎనర్జీ లెవల్స్ పెరిగి, యాక్టీవ్ గా ఉంటారని అంటున్నారు.

చిలగడ దుంపలు, బాదంలో ఫైబర్ కంటెంట్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు... శరీరం యాక్టీవ్ ఉంచుతాయి.

క్వినోవాలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని, జీవ క్రియల పని తీరును మెరుగు పరుస్తాయి.

అలాగే చియా సీడ్స్ ని డైట్ లో చేర్చు కోవడం వల్ల బద్ధకం అనేది దూరం అవుతుంది. అంతే కాకుండా చియా సీడ్స్ తీసుకుంటే తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.