చలికాలంలో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..

02 December 2023

చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చలికాలంలో తినకూడని ఆహారాలు గురించి తెలుసుకుందాం..

చలికాలం సమయంలో కూడా మీకు శీతల పానీయాలు, సోడాలు తాగే అలవాటు ఉన్నట్లయితే, మీ అలవాటును వెంటనే మార్చుకోండి.

ముందుగా ఆహారాన్ని శరీర ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లి ఆ తర్వాత జీర్ణం చేయాలి. ఇందుకు మీ శరీరం రెండింతలు కష్టపడాలి.

చలికాలంలో ఫ్రిజ్‌లోని శీతల పానీయాలు తాగిన తర్వాత జలుబు లేదా గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

చలికాలంలో చల్లటి పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుంది. కాబట్టి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న పెరుగునే తినడం అలవాటు చేసుకోవాలి.

కానీ అది కూడా భోజనం వరకు మాత్రమే. రాత్రిపూట మాత్రం పెరుగు అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో. ప్రాసెస్ చేసిన ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది.

వేయించిన ఆహారంలో అధిక కొవ్వు వాపుకు దారితీస్తుంది శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కాబట్టి నూనెలో డీప్‌ ఫ్రై చేసిన ఆహారాలు అసలు తినకపోవడం మేలు.