ఈ ఆహారాలతో అధిక బరువు సమస్య పరార్..
TV9 Telugu
19th February 2024
కొందరు ఆహారంతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. అయితే బరువు తగ్గడంలో కొన్ని ఆహారాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
రాత్రి పడుకునేముందు ఒక స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగాలి.
శరీరంలో బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
కలబంద జ్యూస్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణసమస్యల నివారణతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే దోసకాయను తీసుకుంటే జీవక్రియ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది.
పోషకాలు అధికంగా ఉన్న బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
బరువు ఈజీగా తగ్గడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కు మించిన డ్రింక్ లేదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గ్లాసుడు జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా చర్మం నిగారింపు వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి