ఈ మూడు చాలు జాండీస్ ఆమడ దూరం..

TV9 Telugu

10 June 2024

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌లు, కర్కుమిన్ సమ్మేళనం వల్ల శరీరంలో వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజూ ఆహారంలో పసుపును తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది.

వర్షకాలంలో భోజనం తర్వాత, మంచినీటిలో పసుపు కలిపి తీసుకోండి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితం తీసుకోవాల్సిన ఆహారం. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు.

చట్నీ, పప్పు, కూరగాయలు మీరు చేసుకొనే ప్రతి ఆహారంలో అల్లం ఉపయోగించండి. ఇది ఆరోగ్యంతో పాటు మంచి రుచిని ఇస్తుంది.

దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కామెర్లు ప్రమాదన్నీ తగ్గిస్తుంది.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మ జీవులను నిరోధిస్తుంది.

మీరు తెలియక వ్యాధి సోకిన ఆహారం లేదా నీరు తీసుకుంటే మీ శరీరం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.