విటమిన్-బి12 కావాలంటే చికెన్, మటన్ మాత్రమే తీసుకోవాలా..?
TV9 Telugu
01 August 2024
చికెన్, మటన్ వంటి మాంసాహారలో మాత్రమే విటమిన్ బి 12 లభిస్తుందని అనుకుంటారు. శాఖాహార పదార్థాలలో కూడా సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్ B12 పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులలో పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు నిపుణులు.
ఒక గ్లాసు (250 మి.లీ) పాలలో దాదాపు 1 మైక్రోగ్రామ్ విటమిన్ బి12 ఉంటుంది. రోజు తాగితే మేలు జరుగుతుంది.
ఒక గిన్నె (150 గ్రాములు) పెరుగు రోజు తినాలి. దీని ద్వారా 0.8 మైక్రోగ్రాముల విటమిన్ బి12 శరీరానికి లభిస్తుంది.
100 గ్రాముల జున్నులో 0.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. అలాగని బయట దొరికిన జున్ను ఎక్కువగా తినకండి.
ఒక గ్లాసు అంటే 250 మి.లీ మజ్జిగ ప్రతిరోజూ తాగితే 0.4 మైక్రోగ్రాముల విటమిన్ B12 శరీరానికి అందుతుంది.
పాలు తాగని వారికి సోయా మిల్క్ మంచి ఎంపిక. ఒక కప్పు (240 ml) ఫోర్టిఫైడ్ సోయా పాలలో 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది.
విటమిన్ B12 పుట్టగొడుగులలో లభిస్తుంది.100 గ్రాముల షిటేక్ మష్రూమ్‌లో 1.9 మైక్రోగ్రాముల విటమిన్ బి12 కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి