కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించే బెస్ట్ ఆయిల్ ఏదో తెలుసా..?

Jyothi Gadda

22 July 2024

కొలెస్ట్రాల్ బాడీలో పెరిగితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అతి ముఖ్యం.

కొలెస్ట్రాల్ మన బాడీలో పెరిగిందనడానికి చాలా లక్షణాల ద్వారా కనిపెట్టొచ్చు. హై కొలెస్ట్రాల్ కారణంగా ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. ఇది ఛాతీలో అసౌకర్యం, నొప్పికి కారణమవుతుంది. 

చర్మంపై కొవ్వు నిల్వలు చిన్న చిన్న కురుపుల్లా ఏర్పడతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే చర్మంపై జాన్థోమాస్ అనే పసుపు రంగులో ఉండే కొవ్వు నిల్వలు కనిపిస్తాయి. ఇవి చర్మం, ముఖ్యంగా కళ్ళు, మోచేతుల చుట్టూ కనిపిస్తాయి.

ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గడం, శ్వాసకోశ పనితీరు ప్రభావితమవుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ లక్షణాన్ని చూసి కొవ్వుపెరిగిందని గుర్తించొచ్చు.

నుల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే ర్త నాళాలు బ్లాక్ అవుతుంటాయి. ఫలితంగా రక్తం గుండె వరకూ చేరడంలో ఆటంకం కలుగుతుది. దాంతో రక్త సరఫరాపై ఒత్తిడి పెరిగి రక్తపోటుకు దారి తీస్తుంది. 

ముఖ్య అవయవాలకి రక్తప్రసరణ తగ్గడం వల్ల అలసట, నీరసం ఏర్పడుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కాళ్ళలో తిమ్మిరి, బలహీనత రావొచ్చు. దృష్టి సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. 

చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం ఆయిలీ పదార్ధాలే. శరీరంలో కొవ్వు పరిమితి దాటి ఉన్నప్పుడు ఆయిలీ పదార్ధాలు తినడం వల్ల ప్లక్ ఏర్పడుతుంది. ఇవ ధమనులకు అంటుకుని ఉంటుంది. 

మనం వాడే వంటనూనె మన ఆరోగ్యంపై కీల పాత్ర పోషిస్తుంటుంది. అందుకే సీడ్స్‌ ఆయిల్‌లో ఉండే, ఓలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసి్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి.