కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫైబర్‌ ఫుడ్‌ కంపల్సరీ

26 October 2023

మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్య‌క‌ర ప్ర‌త్యామ్నాయ ఆహార అలవాట్లను అందిపుచ్చుకుని ఎన్నో వ్యాధుల‌ను తట్టుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

ముఖ్యంగా ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాలు అధికంగా తీసుకోవ‌డం ద్వారా మీ జీర్ణ‌క్రియ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది.

ఫైబర్‌ పుష్కలంగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పుధాన్యాలు, చిక్కుళ్లు, తృణ‌ధాన్యాలు, న‌ట్స్, వంటి ఆహార ప‌దార్ధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

పీచు ప‌దార్ధాలు తీసుకోవ‌డం ద్వారా జీర్ణ‌క్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్ర‌ణ‌తో పాటు మ‌ధుమేహం, గుండెపోటు ముప్పును నివారించవచ్చు.

ఇక ఓట్స్‌తో అల్పాహారం చేయ‌డం ద్వారా రోజు మొత్తం హెల్దీగా కనిపిస్తారు. ఓట్స్ తినడం ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు ఓట్స్‌లో ఉండే అధిక ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఓట్స్‌, డ్రైఫ్రూట్స్‌, ప‌ప్పుధాన్యాలు, యాపిల్‌, స్వీట్ పొటాటో వంటి వాటిలో ఫైబర్‌ అధికంగా లభిస్తుంది.