06 November 2023

మధుమేహం గురించి బయటపడిన ఆసక్తికర అంశాలు..

మధుమేహుల వ్యాదిగ్రస్తులపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటపెట్టారు ఆరోగ్య నిపుణులు.

బీజీఆర్‌-34 వంటి మూలికా ఔషధాలతో రక్తంలో చక్కెర స్థాయిలని 14 రోజుల్లోనే నియంత్రించొచ్చని గుర్తించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహార అలవాట్లు మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలని మన అందరికి తెలిసిన విషయమే.

బీహార్ రాష్ట్రంలోని పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తులకు రెండు వారాల పాటు బీజీఆర్‌-34, ఆరోగ్యవర్ధిని వాతి, చంద్రప్రభావతి ఆయుర్వేద ఔషధాలు అందించారు.

వీటితో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు, జీవనశైలిలో మార్పులు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించారు. 14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు.

ఈ సమయంలో రోగి పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. చికిత్సకు ముందు అతడిలో ఎక్కువగా ఉన్న చక్కెర స్థాయి చికిత్స తర్వాత గణనీయంగా తగ్గింది.

ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని అందువల్ల మరింత విశ్లేషణ కోసం విస్తృత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.